హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రేపు గోవిందరాజుల విగ్రహం ఆవిష్కరణ

పల్నాడు జిల్లా కొండ్రముట్లలో దివంగత మాజీ ఎమ్మెల్యే నలబోలు గోవిందరాజులు 114వ జయంతి సందర్భంగా సెప్టెంబర్ 6న కాంస్య విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించనున్నారు. జీవీ ఆంజనేయులు అధ్యక్షతన జరిగే కార్యక్రమానికి పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, రాజకీయ ప్రముఖులు హాజరుకానున్నారు. ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కుటుంబ సభ్యులు కోరారు.