హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

డ్రగ్స్ వల్ల జీవితాలు నాశనం: సీఐ

ASR: గంజాయి, డ్రగ్స్ తదితర మత్తు పదార్థాల వినియోగం వల్ల జీవితాలు నాశనం అవుతాయని జీకేవీధి సీఐ బీ.సుధాకర్ తెలిపారు. శుక్రవారం సాయంత్రం రామగెడ్డ గ్రామంలో పర్యటించారు. మాదకద్రవ్యాల వినియోగం వల్ల కలిగే అనర్థాలపై గ్రామస్తులకు అవగాహన కల్పించారు. గంజాయి సాగు, రవాణా చేయడం చట్టరీత్యా నేరమన్నారు. డ్రగ్స్ వినియోగం వల్ల శారీరక, మానసిక ఆరోగ్యం దెబ్బతింటుందన్నారు.