హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: పుష్పాలంకరణలో దర్శనమిచ్చిన పెళ్లిళ్ల వెంకన్న

కోనసీమ: అమలాపురం పట్టణం మహిపాల వీధిలో వేంచేసి ఉన్న పెళ్లిళ్ల వెంకన్నగా పేరుగాంచిన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో శనివారం ఉదయం ఆలయ అర్చకులు ఘనంగా తొలి హారతి నిర్వహించి భక్తులకు దర్శనం కల్పించారు. స్వామి వారు ప్రత్యేక పుష్పాలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. అధిక సంఖ్యలో భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకుని, ప్రత్యేక పూజలు నిర్వహించారు.