హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గ్రీన్‌ హైవే పేరుతో మట్టి తవ్వకాలు..!

KDP: సిద్ధవటం మండలం మందపల్లె ప్రాంతంలో గ్రీన్‌ హైవే పనుల పేరుతో అనుమతి లేని సర్వే నంబర్‌ 1152/A1లో మట్టి తవ్వకాలకు యత్నించారని దళిత రైతులు ఆరోపించారు. అనుమతులు 1171, 1175 సర్వే నంబర్లకే ఉన్నప్పటికీ హిటాచీలు, టిప్పర్లతో తవ్వకాలకు ప్రయత్నించారని తెలిపారు. అడ్డుకున్న తమను కులం పేరుతో దూషించి బెదిరించారని ఆరోపిస్తూ ఒంటిమిట్ట సీఐకి ఫిర్యాదు చేశారు.