హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ప్రేమ పేరుతో మోసం.. యువతి ఫిర్యాదు

KDP: పులివెందుల రోటరీపురానికి చెందిన జ్యోతి, మైలవరానికి చెందిన చంద్రకృష్ణారెడ్డి 12 ఏళ్లుగా ప్రేమించుకుంటున్నారు. పెళ్లి చేసుకోవాలని జ్యోతి కోరగా చంద్రకృష్ణారెడ్డి మోసం చేశాడని ఆరోపిస్తూ శుక్రవారం అర్బన్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ పురుషోత్తమరాజు తెలిపారు.