KKD: కార్పొరేట్ సంస్థల కోసం పేద రైతుల పొట్ట కొట్టడం సరికాదని జగ్గంపేట నియోజకవర్గ సామాజికవేత్త పాఠంశెట్టి సూర్య చంద్ర అన్నారు. శుక్రవారం జె.కొత్తూరు జటాద్రి కొండపై 40 ఏళ్లుగా సన్న, చిన్నకారు రైతులు సాగు చేస్తున్న భూములను పరిశీలించారు. రైతులు సాగు చేస్తుండగానే జేసీబీలతో జీడిమామిడి చెట్లను తొలగించడం దారుణమన్నారు. రైతులకు భూములపై పట్టాలు మంజూరు చేయాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
పేద రైతుల పొట్ట కొట్టొద్దు: సూర్యచంద్ర


