హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేడు ఈ ప్రాంతాల్లో పవర్ కట్

ELR: నిడమర్రు సెక్షన్ పరిధిలోని పెద నిండ్రకొలను 33/11 కేవీ సబ్ స్టేషన్లో లైన్ మరమ్మతుల దృష్ట్యా శనివారం ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 1 వరకు సరఫరా నిలిపివేస్తున్నట్లు ఏలూరు ఈఈ రాజశేఖరం తెలిపారు. దీంతో పెద నిండ్రకొలను, చిన్న నిండ్రకొలను, తోకలపల్లి, డి.గోపవరం, పరిసర ఆక్వా గ్రామాల్లో విద్యుత్ ఉండదు. వినియోగదారులు, రైతులు ఈ అంతరాయాన్ని గమనించి సహకరించాలని కోరారు.