హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

తిమ్మరాజుపై పోక్సో కేసు నమోదు

SS: కదిరికి చెందిన బీజేవైఎం మాజీ నాయకుడు తిమ్మరాజుపై పోక్సో కేసు నమోదు చేసినట్లు పట్టణ సీఐ వెంకటేశ్వర్లు తెలిపారు. ప్రేమ పేరుతో కదిరికి చెందిన 17 ఏళ్ల బాలికకు దగ్గరై నాలుగేళ్లుగా వేధింపులకు గురి చేస్తున్నట్లు బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. ఆమె ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు సీఐ వెల్లడించారు.