హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఆంధ్రా పేపర్స్ యాజమాన్యంపై పవన్ ఆగ్రహం

E.G: ఆంధ్రా పేపర్స్ యాజమాన్యం బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ 'X' ద్వారా హెచ్చరించారు. రాజమహేంద్రవరం పరిధిలోని గోదావరి నదిలోకి పరిశ్రమ వ్యర్థాలు చేరుతున్న అంశంపై ఆయన తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. పేపర్ మిల్లు నుంచి వ్యర్థ జలాలు గోదావరిలో కలుస్తున్న ప్రాంతాలను పరిశీలించాలని అధికారులను ఆదేశించారు.