హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం

AKP: పాయకరావుపేట మండలంలో పలు గ్రామాలకు ఈ నెల 6న విద్యుత్తు సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందని ఈఈ రామకృష్ణ తెలిపారు. సత్యవరం సబ్ స్టేషన్‌లో అదనపు ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటు చేస్తున్న కారణంగా ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు సత్యవరం, అరట్లకోట, మంగవరం, మాసాహెబ్ పేట పెద్దిరాజుపాలెం, గోపాలపట్నం, పెంటకోటకు విద్యుత్ సరఫరా ఉండదని వినియోగాదారులు సహకరించాలని కోరారు.