KRNL: పెద్దకడబూరు ఎస్సీ కాలనీలో కోసిగి సీఐ మంజునాథ్, ఎస్సై మారుతి ఆధ్వర్యంలో శుక్రవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మహిళలపై జరిగే నేరాలు, సైబర్ నేరాలు, రోడ్డు ప్రమాదాల నివారణపై ప్రజలకు అవగాహన కల్పించారు. నేరాలు, ప్రమాదాల బారిన పడకుండా ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని, అవసరమైన భద్రతా చర్యలు పాటించాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: సీఐ


