W.G: తణుకు రూరల్ పోలీసు స్టేషన్ పరిధిలో ఓ మైనర్ బాలికపై అసభ్యంగా ప్రవర్తించిన వృద్ధుడిపై పోక్సో కేసు నమోదు చేసినట్లు ఎస్సై ఎన్. శ్రీనివాసరావు తెలిపారు. గ్రామానికి చెందిన బాలిక తల్లి విదేశాల్లో ఉపాధి నిమిత్తం ఉంటోంది. ఈ క్రమంలో అమ్మమ్మ వద్ద ఉంటుండగా అదే ప్రాంతానికి చెందిన ఓ వృద్ధుడు ఆమెకు మాయమాటలు చెప్పి అసభ్యంగా ప్రవర్తించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
వృద్ధుడిపై పోక్సో కేసు నమోదు: SI


