హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గంజాయి స్వాధీనం.. వ్యక్తి అరెస్ట్

VSP: రైల్వే స్టేషన్‌లో ఒక వ్యక్తి నుంచి 5 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు కంచరపాలెం పోలీసులు తెలిపారు. జ్ఞానపురం రైల్వే స్టేషన్‌లో ఒక వ్యక్తి బ్యాగ్లో 5 కేజీల గంజాయి ఉంచుకుని సంచరిస్తుండగా నార్కోటిక్ డాగ్ స్క్వాడ్ సహాయంతో పట్టుకున్నారు. నార్కోటిక్ వింగ్ పోలీసులు యువకుడిని అదుపులోకి తీసుకుని కంచరపాలెం పోలీసులకు అప్పగించారు.