హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం

కృష్ణా: ఉయ్యూరు విద్యుత్ సబ్ స్టేషన్ పరిధిలో నేడు ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు ఏఈ రాజశేఖర్ బాబు తెలిపారు. రావి చెట్టు బజార్, పోస్ట్ ఆఫీస్ రోడ్డు, గౌడ రామాలయం రోడ్డు, పెద్ద ముఠా సెంటర్‌లో విరిగిపోయిన విద్యుత్ స్థంభాల స్థానంలో కొత్తవి ఏర్పాటు చేస్తుండటంతో ఈ అంతరాయం ఏర్పడుతుందని, వినియోగదారులు సహకరించాలని కోరారు.