కృష్ణా: కృత్తివెన్ను మండలం మాట్లం గ్రామంలోని పలు వీధుల్లో డ్రైనేజీ వ్యవస్థ సక్రమంగా లేక మురుగునీరు రోడ్డుపై నిలిచిపోతోంది. దీంతో రాకపోకలకు ఇబ్బందులతో పాటు దుర్వాసన, దోమల బెడదతో స్థానికులు అవస్థలు పడుతున్నారు. కాలువలను శుభ్రం చేసి మురుగునీరు సజావుగా వెళ్లేలా చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు కోరుతున్నారు. సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని కోరుతున్నారు.
ఆంధ్రప్రదేశ్
మాట్లం గ్రామంలో డ్రైనేజీ సమస్య


