SKLM: సరుబుజ్జిలి సబ్ స్టేషన్ పరిధిలో శనివారం విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు ఈఈ పైడి యోగేశ్వరరావు తెలిపారు. స్తంభాలు మార్చడం, చెట్ల కొమ్మల తొలగింపు పనుల కారణంగా ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు సరఫరాకు అంతరాయం ఉంటుందని, వినియోగదారులు సహకరించాలని కోరారు. మరమ్మతు పనుల వల్ల సరుబుజ్జిలి, పరిసర గ్రామాల్లో విద్యుత్ నిలిచిపోతుందని ఆయన పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం


