హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

దివ్యాంగులకు ఉచిత సహాయక పరికరాలు

ASR: జిల్లాలో అర్హులైన దివ్యాంగులకు ఉచిత సహాయక పరికరాల కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునే అవకాశం ఉందని వికలాంగుల హక్కుల పోరాట సమితి తెలిపింది. అర్హత కలిగిన వారు వీల్‌చైర్లు, ట్రైసైకిళ్లు, కృత్రిమ అవయవాలు, వినికిడి యంత్రాలు, ల్యాప్‌టాప్‌లు తదితర పరికరాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని VHPS కోరింది.