హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఉత్సాహంగా ఉట్టి కొట్టే కార్యక్రమం

NLG: చిట్యాల మండలం నేరడలోని శ్రీసీతారామాంజనేయ స్వామి దేవస్థానంలో శుక్రవారం రాత్రి కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా జరిగాయి. స్వామివారికి ప్రత్యేక పూజలు, పుష్పాంజలి నిర్వహించారు. భక్తులు చిడతలు వాయిస్తూ కీర్తనలు పాడుతూ ఉత్సాహంగా నృత్యాలు చేశారు. ఆలయ ఆవరణలో ఉట్టి కొట్టే కార్యక్రమం అత్యంత ఉత్సాహంగా సాగింది. గ్రామస్తులు, భక్తులు హాజరై కార్యక్రమాలను తిలకించారు.