హైదరాబాద్: 28°C
తెలంగాణ

గణేశ్ విగ్రహాల రవాణా.. ట్రాఫిక్ డైవర్షన్స్

HYD: ధూల్‌పేట్ నుంచి గణేశ్ విగ్రహాల కొనుగోలు, రవాణా నేపథ్యంలో సెప్టెంబర్ 5 నుంచి 14 వరకు నగరంలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ మళ్లింపులు చేపట్టనున్నారు. బోయిగూడ కమాన్–గాంధీ విగ్రహం మార్గంలో సాధారణ వాహనాల రాకపోకలను నిలిపివేయనున్నారు. పూరానాపూల్, గాంధీ విగ్రహం వైపు నుంచి వచ్చే వాహనాలను ప్రత్యామ్నాయ మార్గాల్లో మళ్లించనున్నారు.