W.G: గ్రామాల అభివృద్ధికి దాతలు అందిస్తున్న సహకారం అభినందనీయమని డిప్యూటీ స్పీకర్ రఘురామ తెలిపారు. కాళ్ళ మండలం పెదఅమీరంలో ప్రయాణికులు సౌకర్యార్థం గ్రామ మాజీ సర్పంచ్ డొక్కు సోమేశ్వరరావు నిర్మించిన బస్ షెల్టర్‌ను శుక్రవారం ఆయన ప్రారంభించారు. ప్రయాణికులు ఎండలో నిలబడకుండా స్వంత నిధులతో ఎంతో సుందరంగా బస్సు షెల్టర్ నిర్మించిన ఆయన్ని రఘురామ అభినందించారు.
ఆంధ్రప్రదేశ్
దాతల సహకారం అభినందనీయం: డిప్యూటీ స్పీకర్


