SRCL: వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో శ్రీకృష్ణాష్టమి వేడుకలు భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఆలయ అర్చకులు, వేద పండితులు ప్రత్యేక పూజలు, అభిషేకాలు, అర్చనలు నిర్వహించారు. అనంత పద్మనాభ, సీతారామచంద్ర స్వామి ఉపాలయాల్లో పంచోపచార పూజలు, భీమేశ్వర స్వామి ఆలయంలో ప్రదోషకాల పూజలు జరిపారు. అనంతరం నిర్వహించిన ఉట్టి కొట్టే కార్యక్రమం ఆకట్టుకుంది.
తెలంగాణ
VIDEO: రాజన్న క్షేత్రంలో వైభవంగా కృష్ణాష్టమి వేడుకలు


