ఏటూరునాగారం శ్రీసీతారామచంద్రస్వామి ఆలయంలో శుక్రవారం ఇస్కాన్ ప్రభుదాస్ ఆధ్వర్యంలో శ్రీకృష్ణాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఉత్సవవిగ్రహాలకు పంచామృత, పుష్పాభిషేకాలు నిర్వహించి ప్రత్యేక పూజలుచేశారు. భక్తులు పెద్దసంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. నార్త్ ప్రభుత్వ పాఠశాలవిద్యార్థులు రాధాకృష్ణుల వేషధారణలో అలరించి, భక్తిగీతాలకు నృత్యాలు చేశారు.
తెలంగాణ
ఘనంగా శ్రీకృష్ణాష్టమి వేడుకలు


