JGL: బీర్‌పూర్ మండలంలోని కొల్వాయి గ్రామంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించారు. జన్మాష్టమి పర్వదినాన్ని పురస్కరించుకుని గ్రామ ప్రధాన కూడలిలో ఉట్టి కొట్టే కార్యక్రమాన్ని కోలాహలంగా ఏర్పాటు చేశారు. శ్రీకృష్ణుడు గోపికల వేషధారణలో వచ్చిన చిన్నారులు ఉత్సాహంగా ఉట్టి కొట్టి సంబరాలు జరుపుకున్నారు. వేడుకలో గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
తెలంగాణ
కొల్వాయిలో ఘనంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు


