ELR: లక్కవరం గ్రామంలో కోసన తిరుమలరెడ్డి (27) అనే వ్యక్తి తన నివాసంలోని రేకుల షెడ్డులో ఉరివేసుకుని అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. రాఖీ పండుగ కోసం భార్య కాకినాడ వెళ్లిన సమయంలో ఈ ఘటన జరిగింది. కుటుంబ సభ్యుల సమాచారంతో లక్కవరం పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.
ఆంధ్రప్రదేశ్
లక్కవరంలో వ్యక్తి అనుమానాస్పద మృతి


