హైదరాబాద్: 28°C
తెలంగాణ

అక్రమంగా పీడీఎస్ రేషన్ బియ్యాం పట్టివేత

GDWL: మల్దకల్ (మం) ఉలిగేపల్లిలో అక్రమంగా నిల్వ ఉంచిన 6 క్వింటాళ్ల పీడీఎస్ రేషన్ బియ్యాన్ని మల్దకల్ పోలీసులు శుక్రవారం స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి ఉలిగేపల్లి గ్రామానికి చెందిన ఓ వ్యక్తిపై కేసు నమోదు చేశారు. పోలీసులు మాట్లాడుతూ.. పీడీఎస్ బియ్యాన్ని అక్రమంగా కొనుగోలు చేయడం, నిల్వ చేయడం, విక్రయించడం చట్టవిరుద్ధమని పోలీసులు హెచ్చరించారు.