హైదరాబాద్: 28°C
వార్తలు

నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం

BDK: కరకగూడెం మండలంలో శనివారం ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు విద్యుత్‌ సరఫరా నిలిపివేయనున్నట్లు విద్యుత్‌ శాఖ ఏఈ రాజశేఖర్‌ తెలిపారు. 33/11 కేవీ కరకగూడెం ఉపకేంద్రంలోని 33 కేవీ లైన్‌లో మరమ్మతులు మరియు చెట్ల కొమ్మలను తొలగిస్తున్నందున మండలం మొత్తం విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు అన్నారు. కావున వినియోగదారులు అధికారులకు సహకరించాలని వారు కోరారు.