హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రేకుల కాలనీ వాసులతో సమావేశం

SKLM: సోంపేట పట్టణంలోని రేకుల కాలనీ దేవాంగుల సంఘ భవనంలో శుక్రవారం పోలీసులు అవగాహన సమావేశం నిర్వహించారు. సీఐ మంగరాజు, ఎస్సై బి.మోహిని ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో మద్యం, గంజాయి, డ్రగ్స్‌కు యువత బానిస కాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వివరించారు. హెల్మెట్ లేకుండా, లైసెన్స్ లేకుండా, మద్యం సేవించి వాహనాలు నడపరాదని సూచించారు.