హన్మకొండ నగరంలో కృష్ణాష్టమి సందర్భంగా రామ్ నగర్‌లో శుక్రవారం రథయాత్ర ఘనంగా ప్రారంభమైంది. ఒగ్గుడోలు చప్పుళ్లు, కళాకారుల నృత్యాలతో యాత్ర సందడిగా సాగింది. అందంగా అలంకరించిన రథం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. యాదవ సంఘాల నాయకులు, యువత, మహిళలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సంప్రదాయ కళారూపాల ప్రదర్శనతో రామ్ నగర్ పండుగ వాతావరణం నెలకొంది.
తెలంగాణ
VIDEO: ఒగ్గుడోలు చప్పుళ్లతో సందడిగా రథయాత్ర


