హైదరాబాద్: 28°C
తెలంగాణ

మహిళా సేవాదళ్ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు

MNCL: మంచిర్యాలలో శుక్రవారం మహిళా కాంగ్రెస్ సేవాదళ్ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. జిల్లా అధ్యక్షురాలు వనజా రాణి అధ్యక్షతన జరిగిన ఈ సదస్సుకు సేవాదళ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ నీలకంఠేశ్వర్ రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సేవే లక్ష్యం– సామాజిక అభివృద్ధే ధ్యేయం నినాదంతో జిల్లాలో సేవాదళ్‌‌ను మరింత బలోపేతం చేస్తామని తెలిపారు.