హైదరాబాద్: 28°C
తెలంగాణ

'చలో హైదారాబాద్ విజయవంతం చేయాలి'

MNCL: ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్ల సమస్యల పరిష్కారానికి ఈ నెల 10న చలో హైదారాబాద్ విజయవంతం చేయాలని టీజీ జేఏసీ జిల్లా ఛైర్మన్ గడియారం శ్రీహరి పిలుపునిచ్చారు. శుక్రవారం మంచిర్యాలలోని టీఎన్జీఓ భవన్‌లో నిర్వహించిన సమావేశంలో పోస్టర్లను విడుదల చేశారు. జిల్లా నుంచి ఐదు వేల మంది ఉద్యోగులు చలో హైదరాబాద్ కార్యక్రమంలో పాల్గొననున్నట్లు ఆయన తెలిపారు.