ప్రకాశం: నాగులుప్పలపాడు మండలం కనపర్తిలో వైసీపీ ఆధ్వర్యంలో దివంగత నేత వైఎస్ఆర్ విగ్రహాన్ని రాజ్యసభ సభ్యుడు వై.వి సుబ్బారెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి ఆయన చేసిన సేవలను కొనియాడారు. కార్యక్రమంలో దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, మాజీమంత్రి మేరుగ నాగార్జున, జిల్లా పరిషత్ ఛైర్మన్ బూచేపల్లి వెంకాయమ్మ పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
కనపర్తిలో వైఎస్ఆర్ విగ్రహావిష్కరణ


