హైదరాబాద్: 28°C
క్రీడలు

ఐదేళ్ల తర్వాత బరోడా జట్టులోకి రీఎంట్రీ

ఐదేళ్ల క్రితం కెప్టెన్ కృనాల్ పాండ్యాతో వివాదం కారణంగా బరోడా జట్టును వీడిన దీపక్ హుడా.. మళ్లీ తన సొంత జట్టుకు తిరిగొచ్చాడు. కృనాల్‌తో గొడవల కారణంగా హుడాపై అప్పట్లో బీసీఏ వేటు వేసింది. దీంతో అతడు రాజస్తాన్ జట్టుకు మారాడు. ఇప్పుడు విభేదాలన్నీ తొలిగిపోవడంతో మళ్లీ బరోడా తరఫున దేశవాళీ క్రికెట్ ఆడేందుకు సిద్ధమయ్యాడు.