హైదరాబాద్: 28°C
క్రీడలు

యువ అథ్లెట్‌కు ఆన్‌లైన్‌లో వేధింపులు

ప్రపంచ జూనియర్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్‌షిప్‌లో రజతం సాధించిన భారత యువ లిఫ్టర్ కేయా బెనర్జీ (21)కి నెట్టింట చేదు అనుభవం ఎదురైంది. 140 కిలోల బరువు ఎత్తి రికార్డు సృష్టించిన ఆమె వీడియో వైరల్ అయింది. దీంతో ఆమెకు నెట్టింట వేధింపులు ఎదురవుతున్నాయి. AI సాయంతో ఆమె ముఖాన్ని మార్ఫింగ్ చేసి అసభ్యకరమైన డీప్‌ఫేక్ చిత్రాలను వైరల్ చేస్తున్నారని కేయా ఆవేదన వ్యక్తం చేసింది.