టీమిండియా ఓపెనర్ అభిషేక్ శర్మ వార్షికాదాయం సుమారు రూ.15 కోట్ల నుంచి రూ.20 కోట్లు ఉంటుందని పలు నివేదికలు పేర్కొంటున్నాయి. అతడు ఐపీఎల్‌లో SRH తరఫున ఆడుతూ.. ఏడాదికి రూ.14 కోట్లు ఆర్జిస్తున్నాడు. అలాగే, బీసీసీఐ గ్రేడ్-C కాంట్రాక్ట్‌లో ఉండటంతో ఏడాదికి రూ.కోటి అందుకుంటున్నాడు. ఇవేకాకుండా మ్యాచ్ ఫీజులు, బ్రాండ్లకు ప్రచారకర్తగా వ్యవహరిస్తూ భారీగానే ఆదాయాన్ని ఆర్జిస్తున్నాడు.
క్రీడలు
అభిషేక్ శర్మ వార్షికాదాయం ఎంతో తెలుసా?


