JGL: కొండగట్టు అంజన్న ఆలయ గుట్టపై ఎన్నో ఏళ్లుగా సెల్‌ఫోన్ సిగ్నల్ లేక భక్తులు, ఆలయ సిబ్బంది కమ్యూనికేషన్ సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యకు పరిష్కారంగా నూతనంగా ఏర్పాటు చేసిన సెల్ టవర్‌ను చొప్పదండి ఎమ్మెల్యే డా. మేడిపల్లి సత్యం శుక్రవారం ప్రారంభించారు. టవర్ అందుబాటులోకి రావడంతో గుట్టపై భక్తులకు మెరుగైన కమ్యూనికేషన్ సౌకర్యం కలగనుంది.
తెలంగాణ
కొండగట్టుపై సెల్ టవర్‌ను ప్రారంభించిన ఎమ్మెల్యే


