MDK: అత్యవసర సేవలైన డయల్ 100/112 నంబర్లకు అనవసరంగా ఫోన్ చేసి వేధిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్సై మధుకర్ రెడ్డి హెచ్చరించారు. గోమారం గ్రామానికి చెందిన చిత్తారి నరసింహులు అనే వ్యక్తి తాగి పలుమార్లు కాల్స్ చేయడంతో పోలీసులు అతడికి కౌన్సిలింగ్ ఇచ్చి, తహసీల్దార్ ముందు బైండోవర్ చేశారు. మళ్లీ ఇలాగే ప్రవర్తిస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని స్పష్టం చేశారు.
తెలంగాణ
తాగి డయల్ 100కి రచ్చ.. బైండోవర్ చేసిన ఎస్సై


