హైదరాబాద్: 28°C
తెలంగాణ

హాదీని పరామర్శించిన మాజీ మంత్రి

MBNR: ఎంఐఎం జిల్లా అధ్యక్షుడు హాదీ అనారోగ్యంతో హైదరాబాద్‌లోని ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. విషయం తెలుసుకున్న మాజీ మంత్రి వీ. శ్రీనివాస్ గౌడ్ ఆసుపత్రికి వెళ్లి ఆయనను పరామర్శించారు. హాదీ ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఆయన త్వరగా కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి రావాలని ఆకాంక్షించారు.