హైదరాబాద్: 28°C
తెలంగాణ

మార్కెట్ అభివృద్ధికి రూ.2.18 కోట్లు మంజూరు: MLA

HNK: వ్యవసాయ మార్కెట్‌లో ఇంటిగ్రేటెడ్ కవర్ షెడ్, రైతు విశ్రాంతి భవనం నిర్మాణానికి రూ.2.18 కోట్లు మంజూరైనట్లు MLA ప్రకాశ్‌రెడ్డి తెలిపారు. వర్షాకాలంలో ధాన్యం తడవకుండా రైతులకు సౌకర్యాలు కల్పించడమే లక్ష్యమన్నారు. నిధులు మంజూరైన సందర్భంగా మార్కెట్ కమిటీ ఛైర్మన్ చందుపట్ల రాజిరెడ్డి, వైస్ ఛైర్మన్ రవీందర్ MLAను శాలువాతో సత్కరించి కృతజ్ఞతలు తెలిపారు.