ASF: దహెగాం మండలంలో శ్రీకృష్ణాష్టమి వేడుకలను భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. స్థానిక ఆలయాల్లో ప్రత్యేక పూజలు, అభిషేకాలు, భజన కార్యక్రమాలు నిర్వహించారు. శ్రీకృష్ణుడు, రాధ వేషధారణలో అలంకరించిన చిన్నారులు అందరినీ ఆకట్టుకున్నారు. అనంతరం ఉట్టి కొట్టే కార్యక్రమం, పోల్ ఎక్కే పోటీలు, చిన్నారుల సాంస్కృతిక ప్రదర్శనలు వేడుకలు అలరించాయి.
తెలంగాణ
VIDEO: భక్తిశ్రద్ధలతో శ్రీకృష్ణాష్టమి వేడుకలు


