హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రాష్ట్ర ఉత్తమ అధ్యాపకుడిగా జిల్లా వాసి

AKP: రాష్ట్ర ఉత్తమ అధ్యాపకుడిగా నర్సీపట్నం ప్రభుత్వం మహిళా జూనియర్ కళాశాలలో మ్యాథమెటిక్స్ అధ్యాపకుడిగా పని చేస్తున్న పి.వెంకటేశ్వరరావు ఎంపికయ్యారు. ఆయనకు ఉపాధ్యాయ దినోత్సవం నాడు అమరావతిలో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అవార్డు ప్రదానం చేస్తారు. ఆయనకు అవార్డు లభించడం పట్ల కళాశాల ప్రిన్సిపల్ శోభ, అధ్యాపకులు హర్షం వ్యక్తం చేశారు.