AKP: నక్కపల్లి మండలం నుంచి 5గురు ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలకు ఎంపికైనట్లు ఎంఈవో కే.నరేష్ శుక్రవారం తెలిపారు. బండారు కొండలరావు, కందుకూరి విజయలక్ష్మి, బోడపాటి నాగమణి, కే.చిన్నారావు, ఓ.అంజలి ఎంపికయ్యారు. విద్యార్థులకు ప్రత్యేక తరగతులు, తల్లిదండ్రుల సమన్వయం, కృత్యాధార బోధన, ఆన్‌లైన్ కార్యక్రమాల అమలు తదితర అంశాలపై వీరిని ఎంపిక చేసినట్లు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
జిల్లా ఉత్తమ ఉపాధ్యాయులుగా ఐదుగురు ఎంపిక


