హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఎర్రవెల్లిలో ఈ నెల 6న బీఆర్ఎస్ ఎల్పీ భేటీ

SDPT: సెప్టెంబర్ 7న ప్రారంభం కానున్న శాసనసభ సమావేశాల నేపథ్యంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 6న మధ్యాహ్నం 2 గంటలకు ఎర్రవెల్లిలోని తన నివాసంలో బీఆర్ఎస్ శాసనసభాపక్ష (BRSLP) సమావేశం నిర్వహించనున్నారు. సభలో అనుసరించాల్సిన వ్యూహంపై దిశానిర్దేశం చేయనున్న ఈ భేటీకి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలంతా విధిగా హాజరుకావాలని స్పష్టం చేశారు.