SKLM: నరసన్నపేట పట్టణంలోని మారుతీనగర్-2లో వీధి కుక్కల బెడద ఎక్కువగా ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గుంపులుగా తిరుగుతూ చిన్నారులు, వృద్ధులపై దాడులకు పాల్పడుతున్నాయని వాపోతున్నారు. రాత్రి వేళల్లో బయటకు వెళ్లాలంటే భయంగా ఉందని అంటున్నారు. మున్సిపల్ అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
ఆంధ్రప్రదేశ్
నరసన్నపేటలో వీధి కుక్కల బెడద


