హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఘనంగా కొరివి కృష్ణస్వామి ముదిరాజ్ జయంతి వేడుకలు

KMR: ఎల్లారెడ్డిలోని ముదిరాజ్ సంఘ భవనంలో నేడు కొరివి కృష్ణస్వామి ముదిరాజ్ జయంతి వేడుకలను మండల అధ్యక్షులు ప్యాలాల రాములు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ముదిరాజ్ మహాసభ జిల్లా అధ్యక్షులు బట్టు విట్టల్ ముదిరాజ్ మాట్లాడుతూ.. కొరివి కృష్ణస్వామి ముదిరాజ్ సామాజిక, రాజకీయ, విద్యా, పాత్రికేయ రంగాల్లో విశేష సేవలు అందించారని కొనియాడారు.