హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అత్తపై కత్తితో విరుచుకుపడ్డ అల్లుడు

GNTR: భార్య పుట్టింటికి వచ్చిందనే ఆగ్రహంతో పెదకాకాని మండలం నంబూరులో శుక్రవారం నాగిరెడ్డి అనే వ్యక్తి అత్త మాధవి(50) తలపై కత్తితో దాడి చేశాడు. అడ్డుకోబోయిన పిన్ని ధనమ్మనూ గాయపరిచాడు. తీవ్రంగా గాయపడిన ఇద్దరినీ గుంటూరు జీజీహెచ్‌కు తరలించగా, మాధవి పరిస్థితి విషమంగా ఉంది. పెదకాకాని పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.