హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: 'కాలువ పనులపై విచారణ జరపాలి'

ASF: ఆసిఫాబాద్‌ సమీపంలోని మాణిక్‌గూడలో కుడి కాలువ మరమ్మతుల పేరుతో ప్రజాధనం దుర్వినియోగమైందని సీపీఎం నాయకులు ఆరోపించారు. శుక్రవారం కాలువ పనులను పరిశీలించిన జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు దుర్గం దినకర్, కోట శ్రీనివాస్ మాట్లాడుతూ.. చిన్న వర్షానికే కాలువ మట్టి కొట్టుకుపోయి సీసీ రోడ్డు దెబ్బతిందన్నారు. పనులపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.