హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పోలీస్ టెన్నిస్ విజేతగా బాపట్ల టౌన్ సీఐ

BPT: 1వ ఏపీ స్టేట్ పోలీస్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్–2026లో బాపట్ల టౌన్ సీఐ ఆర్. రాంబాబు లాన్ టెన్నిస్ సింగిల్స్ విజేతగా నిలిచి ట్రోఫీని కైవసం చేసుకున్నారు. మంగళగిరిలో జరిగిన ఈ పోటీలలో 20 మందికి పైగా అధికారులను అధిగమించి ఆయన ఈ ఘనత సాధించారు. శుక్రవారం బాపట్ల జిల్లా ఎస్పీ బి.ఉమామహేశ్వర్ ఐపీఎస్ సీఐ రాంబాబును అభినందించి మెడల్‌తో సత్కరించారు.