హైదరాబాద్: 28°C
తెలంగాణ

సన్న వడ్లకు నమోదు తప్పనిసరి: ఏవో

GWDL: సన్న రకం వరి సాగు చేసిన రైతులు విత్తన వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవాలని కేటీదొడ్డి ఏవో రాజవర్ధన్‌రెడ్డి సూచించారు. RNR, BPT, KNM-1638, KNM-7745 రకాలు సాగు చేసిన వారు డీలర్‌ బిల్లు లేదా స్వీయ ధ్రువీకరణ పత్రంతో వ్యవసాయ అధికారులను సంప్రదించాలన్నారు. ఆన్‌లైన్‌లో నమోదు చేసుకున్న రైతులకే సన్న వడ్ల బోనస్‌ వర్తిస్తుందని స్పష్టం చేశారు.