హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'అందరికీ వైద్య సేవలే లక్ష్యం'

VSP: ప్రపంచవ్యాప్తంగా అందరూ ఆరోగ్యంగా జీవించాలనేదే తన లక్ష్యమని విశాఖకు చెందిన వైద్యురాలు, పలు అంతర్జాతీయ సుందరి కిరీటాల విజేత డాక్టర్ మాలినీ దాసరి అన్నారు. పెందుర్తి మండలం పెద్దగాడిలోని సంకల్ప కళా గ్రామంలో ఆమె విలేకరులతో మాట్లాడారు. వైద్యశాలకే పరిమితం కాకుండా 'వాక్ బియాండ్ ద వైట్ కోట్' పేరిట విస్తృత వైద్య సేవలు అందిస్తున్నట్లు తెలిపారు.