NRML: ఖానాపూర్ మండల పరిధిలోని గ్రామాల్లో కొద్దిరోజులుగా మొసళ్ల సంచారం కలకలం రేపుతోంది. పంట పొలాలు, వ్యవసాయ బావుల్లో ప్రత్యక్షమవుతుండటంతో రైతులు, గ్రామస్థులు బెంబేలెత్తుతున్నారు. దిలావర్‌పూర్, తర్లపాడ్, గోడలపంపు గ్రామాల్లో మొసళ్లు కనిపించడంతో పొలాలకు వెళ్లేందుకు జంకుతున్నారు. అధికారులు తక్షణమే స్పందించి సమస్యను పరిష్కరించాలని స్థానికులు కోరుతున్నారు.
తెలంగాణ
కలకలం రేపుతున్న మొసళ్ల సంచారం


